నిజ ఘటనలతో రామ్ సినిమా

  • IndiaGlitz, [Sunday,December 06 2015]

స‌క్సెస్ కోసం అర్రులు చాస్తున్న హీరో రామ్ పండ‌గ‌చేస్కో', శివమ్' సినిమాల త‌ర్వాత చేస్తున్న సినిమా నేను...శైజ‌ల‌'. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి ర‌వికిషోర్ నిర్మించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించాడు. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని డిసెంబ‌ర్ 12న విడుద‌ల చేసి జ‌న‌వ‌రి 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత‌లు అధికార‌కంగా ప్ర‌క‌టించారు. ఈ సినిమా త‌న నిజ‌జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. అంటే నిజ జీవిత ఘ‌ట‌నల‌తో రామ్ సినిమాను చూడ‌బోతున్నామ‌న్న‌మాట‌. రామ్ ఈ సినిమాపై చాలా ఆశలను పెట్టుకున్నాడు.