‘మాస్’ ఇమేజ్‌ను కాపాడుకునే ఆలోచనలో రామ్!

  • IndiaGlitz, [Friday,September 06 2019]

టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ పోతినేని.. సినిమాలు కూడా అంతే ఎనర్జిటిక్‌గా ఉండే కథలనే ఎంచుకుంటుంటాడు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్‌ను పెంచేసుకున్నాడు. అయితే ఇక నుంచి మాస్‌కు దగ్గరవ్వాలని.. ఇప్పుడంతా మాస్‌నే కోరుకుంటున్నారని ఈ యంగ్ హీరో భావిస్తున్నాడట. అందుకే తనకు కథ చెప్పడానికి వచ్చిన దర్శకనిర్మాతలకు మొదట.. ‘మాస్ టచ్ ఉందా లేదా..?’ అని అడిగి ఆ తర్వాతే వింటున్నాడట.

ఇదిలా ఉంటే.. రామ్‌ను హీరోగా పెట్టి ‘శైలజా కిరణ్’ తీసిన కిషోర్ తిరుమల.. ఇదే కాంబోలో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. వాస్తవానికి కిషోర్ తిరుమల అంటే ప్రేమ కథలకు పెట్టిన పేరు.. అయితే ఈ లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా మాస్ టచ్ కూడా ఇవ్వండని ఈ కుర్ర హీరో కోరాడట. ఇందుకు స్పందించిన కిషోర్.. మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలను జోడించడం తనవల్ల కాదని తేల్చిచెప్పినట్లు సమాచారం.

అందుకే రామ్ ఆలోచనలో పడ్డాడట. అందుకే ఈ మాస్ ఇమేజ్‌ను ఎలా కాపాడుకోవాలి..? వారికి ఎలాంటి కథలతో దగ్గరవ్వాలి..? అని పూర్తిగా రామ్ ఆలోచనలో పడ్డాడట. మరి ఈ మాస్ ఫాలోయింగ్ ఎన్ని రోజులు ఉంటుందో..? ఏ మాత్రం మాస్ టచ్ ఉండే సినిమాలకే రామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.