తన తాతయ్య మరణించారంటూ రామ్ భావోద్వేగ ట్వీట్

  • IndiaGlitz, [Tuesday,May 18 2021]

యంగ్ హీరో రామ్ పోతినేని ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ భావోద్వేగ ట్వీట్‌ పెట్టాడు. తన తాతయ్య లారీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారని వెల్లడించారు. అనంతరం ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఆయన జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని పేర్కొన్నాడు. రిచ్‌నెస్ అనేది మన జేబు నుంచి రాదని.. మన మంచి మనసు నుంచి వస్తుందని తన తాతయ్య నిరూపించారని రామ్ వెల్లడించాడు.

‘‘తాతయ్య జీవితం.. విజయవాడలో ఒక గౌరవప్రదమైన లారీ డ్రైవర్‌ నుంచి ప్రారంభమైంది. మంచి మనసుతో కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా తాతగారూ’ అని రామ్‌ పేర్కొన్నాడు.

More News

రాజమౌళి ఆనవాయితీ.. చరణ్, ఎన్టీఆర్ విధ్వంసం ఊహకి కూడా అందదా!

ఐదేళ్లపాటు రాజమౌళి కష్టపడి తీర్చిదిద్దిన బాహుబలి రెండు భాగాలని చూసి ఆనందించాం.. విజువల వండర్ అని మురిసిపోయాం.

పిక్ టాక్: బికినీలో తేజస్వి.. సముద్రపు ఒడ్డున ఒంపుల వయ్యారి

క్యారెక్టర్ రోల్స్ తో తన కెరీర్ ని స్లోగా ప్రారంభించింది తేజస్వి మదివాడ. క్యారెక్టర్ రోల్స్ చేస్తూ కూర్చుంటే లాభం లేదనుకుందో ఏమో కానీ క్రమంగా

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేసీఆర్ నిర్ణయం

తెలంగాణలో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు సోనూసూద్ హామీ

కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించాక ప్రముఖ నటుడు సోనూసూద్ ప్రజలకు అందిస్తున్న సాయం అంతా ఇంతా కాదు.

తెలంగాణ విద్యార్థికి కరోనా కష్టం.. చెట్టుపైనే ఐసొలేషన్..

కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అత్యంత దయనీయ స్థితిలోకి తీసుకెళుతోంది.