తన తాతయ్య మరణించారంటూ రామ్ భావోద్వేగ ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో రామ్ పోతినేని ఇంట విషాదం నెలకొంది. ఆయన తాతయ్య మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ భావోద్వేగ ట్వీట్ పెట్టాడు. తన తాతయ్య లారీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారని వెల్లడించారు. అనంతరం ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఆయన జీవితం తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని పేర్కొన్నాడు. రిచ్‌నెస్ అనేది మన జేబు నుంచి రాదని.. మన మంచి మనసు నుంచి వస్తుందని తన తాతయ్య నిరూపించారని రామ్ వెల్లడించాడు.
‘‘తాతయ్య జీవితం.. విజయవాడలో ఒక గౌరవప్రదమైన లారీ డ్రైవర్ నుంచి ప్రారంభమైంది. మంచి మనసుతో కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ టైర్లపైనే నిద్రించేవాళ్లు. జేబులో ఉన్న డబ్బుని బట్టి ఎవరూ ధనవంతులు కాలేరని, కేవలం మంచి మనస్సు వల్లే ప్రతి ఒక్కరూ ధనవంతులు అవుతారని మీరే మాకు నేర్పించారు. మీ పిల్లలందరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే దానికి మీరే కారణం. కానీ, ఇప్పుడు మీ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా తాతగారూ’ అని రామ్ పేర్కొన్నాడు.
From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King.
— RAm POthineni (@ramsayz) May 18, 2021
You’ve shown us that richness comes not from what’s in your pocket but from what lies in your heart.
1/2 pic.twitter.com/TLBvzWRaiT
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com