రామ్‌, దిల్‌రాజు 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,March 08 2018]

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ఈరోజు హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఎర్నేని న‌వీన్‌, స్ర‌వంతి ర‌వికిషోర్ స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్‌కు అందించారు. ముహూర్త‌పు స‌న్నివేశాకి అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేయ‌గా, వంశీ పైడిప‌ల్లి క్లాప్ కొట్టారు. హ‌రీశ్ శంక‌ర్ ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ కీల‌కపాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ మార్చి 12 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు.

విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు.. దిల్‌రాజు, రామ్‌ల ప‌వ‌ర్ ఫుల్ కాంబినేషన్ లో రూపొదుతున్న చిత్రం కానుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.