‘రెడ్‌’ రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్‌

  • IndiaGlitz, [Saturday,April 11 2020]

కోవిడ్ 19 దెబ్బ‌కు ప్ర‌పంచ‌మే కుదేల‌వుతుంది. భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే మ‌న‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డింది. ప‌లు రంగాలు కుంటుప‌డ్డాయి. అయితే ప్ర‌జ‌ల ప్రాణాలే ముఖ్య‌మ‌ని భావించిన ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. ఈ లాక్ డౌన్ మ‌రికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇప్ప‌టికే దాదాపు రెండు నెల‌లుగా సినిమా థియేట‌ర్స్ మూత ప‌డ‌టం, షూటింగ్స్ ఆగిపోవ‌డం సినిమా రంగానికి చెప్ప‌లేని న‌ష్టాన్ని క‌లిగించేవే. దీంతో సినిమాలను ఓటీఠీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ఆస‌క్తి చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్త‌లు వెలువ‌డ్డాయి. అలా ఓటీటీ విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌ల్లో నిలిచిన సినిమాల్లో రామ్ రెడ్ ఒక‌టి.

త‌మిళ చిత్రం త‌డ‌మ్ రీమేక్‌గా రూపొందుతోన్న రెడ్ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 9న విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆగింది. ఈ నేప‌థ్యంలో సినిమా డిజిట‌ల్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే దీనిపై హీరో రామ్ ఈ రూమ‌ర్స్‌కు క్లారిటీ ఇచ్చారు. త‌న రెడ్ సినిమా థియేట‌ర్స్‌లోనే విడుదలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదంటూ రామ్ రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు.

More News

నాని ‘వి’ సినిమాకు భారీ ఆఫ‌ర్‌.. నిర్మాత‌లు ఒప్పుకుంటారా?

నేచురల్ స్టార్ నాని, మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ‘వి’. ఈ సినిమాలో నాని గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌గా..సుధీర్ బాబు అత‌న్ని

బన్నీ సినిమాలో బాలీవుడ్ విలన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘పుష్ప’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మాట మీద నిల‌బ‌డే వ్య‌క్తి .. త‌మ‌న్‌: బ‌న్నీ

బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేవు. ఎప్ప‌టి నుండో ఎదురు చూసిన సాలిడ్ హిట్‌ను ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో సాధించేశాడు. బ‌న్నీ,

ఫేక్ న్యూస్‌పై స్పందించిన మెగాస్టార్‌

మెగాస్టార్ చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి క‌రోనా వైర‌స్ పోరాటంలో భాగంగా త‌న వంతు సాయం చేస్తున్నార‌ని, అందులోభాగంగా త‌న స్నేహితుల‌తో క‌లిసి 700 మాస్కుల‌ను త‌యారు చేసి

రియ‌ల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంక‌టేశ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో డాక్ట‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అహ‌ర్నిశ‌లు ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.