‘రెడ్’ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్
Send us your feedback to audioarticles@vaarta.com
కోవిడ్ 19 దెబ్బకు ప్రపంచమే కుదేలవుతుంది. భారతదేశం విషయానికి వస్తే మనదేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గట్టిగానే పడింది. పలు రంగాలు కుంటుపడ్డాయి. అయితే ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించిన ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఈ లాక్ డౌన్ మరికొన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా సినిమా థియేటర్స్ మూత పడటం, షూటింగ్స్ ఆగిపోవడం సినిమా రంగానికి చెప్పలేని నష్టాన్ని కలిగించేవే. దీంతో సినిమాలను ఓటీఠీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అలా ఓటీటీ విడుదలవుతుందని వార్తల్లో నిలిచిన సినిమాల్లో రామ్ రెడ్ ఒకటి.
తమిళ చిత్రం తడమ్ రీమేక్‌గా రూపొందుతోన్న రెడ్ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా ప్రభావంతో సినిమా విడుదల ఆగింది. ఈ నేపథ్యంలో సినిమా డిజిటల్‌లో విడుదలవుతుందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై హీరో రామ్ ఈ రూమర్స్‌కు క్లారిటీ ఇచ్చారు. తన రెడ్ సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదంటూ రామ్ రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout