మోడీ పాత్ర‌లో చెర్రీ విల‌న్‌...

  • IndiaGlitz, [Tuesday,January 01 2019]

ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తుంది. ప్ర‌ముఖ సినీ, రాజ‌కీయ‌, క్రీడా కారుల జీవితాల‌ను బ‌యోపిక్స్‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఆ వ‌రుస‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జీవితాన్ని సినిమా రూపంలో తెర‌కెక్కించ‌బోతున్నారు.

ఈ బ‌యోపిక్‌లో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ ప్ర‌ధాని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌నేది టాక్‌. మ‌రి మోడీ జీవితంలో ఏ అంశాల‌ను ఈ బ‌యోపిక్‌లో చూపించ‌బోతున్నార‌నే దానిపై ఓ క్లారిటీ రానుంద‌ట‌.

వివేక్ ఒబెరాయ్ న‌టించిన 'విన‌య విధేయ రామ‌' ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది.