'రంగస్థలం' ఫస్ట్ లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన భారీ చిత్రం 'రంగస్థలం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.ఎం(మోహన్) నిర్మాతలు ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ...
'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత మా బ్యానర్లో రూపొందుతోన్న మోస్ట్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ 'రంగస్థలం' మెగాపవర్‌స్టార్ రామ్ఛరణ్గారికి సంబంధించిన లుక్‌తో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాం. ఇప్పటికే దీనికి సంబంధించి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాను సుకుమార్‌గారు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. చిట్టిబాబు అనే పాత్రలో రామ్‌చరణ్ మాస్ యాక్టింగ్, సమంత గ్లామర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదు.
ఐదు రోజుల టాకీ, రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ నెలలో టాకీ పార్ట్‌ను పూర్తి చేస్తాం. జనవరిలో రెండు పాటలను షూట్ చేస్తాం. దీంతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం మా బ్యానర్ వాల్యూను పెంచడమే కాకుండా మా సంస్థకు హ్యాట్రిక్ హిట్‌ను అందించే చిత్రమవుతుందని నిర్మాతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com