చెర్రీ నెక్స్ షెడ్యూల్ పిక్స్ అయింది
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మాతగా నిర్మితమవుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది.
ఇటీవల బ్యాంకాక్ వెళ్లిన యూనిట్ ... ఆ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌తో పాటు హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే ప్లాన్ చేశారు. ఈ నెల 15 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
కియరా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, స్నేహ, అర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments