సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో..
Send us your feedback to audioarticles@vaarta.com
సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెగా హీరో ఎవరో కాదు...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. బ్రూస్ లీ తర్వాత రామ్ చరణ్ తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ మూవీని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే...నాన్నకు ప్రేమతో...సినిమా నచ్చడంతో సుకుమార్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడట రామ్ చరణ్. ఇటీవల రామ్ చరణ్ కి సుకుమార్ ఓ లైన్ చెప్పడం...అది నచ్చడంతో చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. భారీ చిత్రాల నిర్మాత చరణ్ - సుక్కు కాంబినేషన్లో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ...ఆ నిర్మాత ఎవరు...? ఇది ఏ తరహా చిత్రమనేది తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments