ఆ డైరెక్ట‌ర్‌తో చెర్రీ మ‌రోసారి...

  • IndiaGlitz, [Saturday,April 13 2019]

ప్ర‌స్తుతం మ‌హేష్ 'మ‌హ‌ర్షి' చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. మే 9న సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి ఏ డైరెక్ట‌ర్‌తో సినిమా చేస్తాడ‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మాత్రం మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో ఈ ద‌ర్శ‌కుడు సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

రీసెంట్‌గా చ‌ర‌ణ్‌ను క‌లిసిన‌ప్పుడు మెయిన్ పాయింట్ చెప్పాడ‌ట‌. చ‌ర‌ణ్ కూడా ప్రాథ‌మికంగా ఓకే చెప్పాడ‌ట‌. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపిస్తే తాను సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాన‌ని అన్నాడ‌ట చెర్రీ.

ప్ర‌స్తుతం 'మ‌హ‌ర్షి' సినిమాను విడుద‌ల‌కు సిద్ధం చేసే ప‌నిలో వంశీ పైడిప‌ల్లి బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌యిన త‌ర్వాత కొన్ని రోజులు హాలీడేస్ తీసుకుని త‌ర్వాత చ‌ర‌ణ్ స్క్రిప్ట్‌పైన కూర్చుంటాడ‌ట‌.

రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం 'RRR' చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఇది పూర్తి కావ‌డానికి ఈ ఏడాది వ‌ర‌కు ఈ సినిమాతో చెర్రీకి స‌రిపోతుంది. వ‌చ్చే ఏడాదినే రాంచ‌ర‌ణ్ కొత్త సినిమా ఉంటుంది. నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని స‌మాచారం. అంతా అనుకున్న‌ట్లు కుదిరితే ఎవ‌డు త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా ఇదే అవుతుంది.

More News

ఈసీ పై సీఎం గరం గరం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఈసీ ని తానెప్పుడూ చూడలేదని...వివి ప్యాట్ లా లెక్కింపు పై సుప్రీంకోర్టు

మరోసారి హాలీవుడ్‌కి..

హాలీవుడ్ సినిమాల్లో భారతీయ కళాకారులు నటించడం అనేది ఎప్పటి నుండో వస్తున్నదే. అయితే ఈవుధ్యకాలంలో నటుల కంటే నటీవుణులకు హాలీవుడ్‌లో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

నిర్మాత ..ఎ.ఆర్.రెహమాన్

భారతీయ సినీ సంగీతానికి కొత్త అడుగులు నేర్పించిన సంగీత ఘనుడు ఎ.ఆర్.రెహమాన్. సినీ రంగంలో తొలి ఆస్కార్ అవార్డు సాధించిన ఘనత కూడా రెహమాన్‌దే.

స్మృతి పై విమర్శలకు దిగిన కాంగ్రెస్

స్మృతి ఇరానీ.... కేంద్ర మంత్రి... కానీ తానేం చదివిందో తనకే తెలియడం లేదు. ఓసారి బీ.ఏ. అంటుంది... మరోసారి బీ. కామ్ అంటుంది... ఇంకోసారి అసలు నేను డిగ్రీ పూర్తి చేయలేదు అంటుంది...

‘ఎన్.జి.కె’ ఫస్ట్ సింగిల్‌తో సందడి చేస్తున్న సింగం సూర్య

'గజిని', 'సింగం' చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ