కొత్త దర్శకుడితో చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దాని పై క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ సినిమా ఉంటుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ లిస్టులో ఓ కొత్త దర్శకుడు చేరారు. అతనెవరో కాదు.. గౌతమ్ తిన్ననూరి.
సక్సెస్ ఉంటే చాలు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమాలు చేయాలనుకుంటారు. ఇప్పుడు ఆ వరుసలో గౌతమ్ తిన్ననూరి చేరారు. 'మళ్ళీరావా', 'జెర్సీ' ,చిత్రాలతో వరుస విజయువంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి త్వరలోనే చరణ్‌కు కథను వినిపించబోతున్నాడట. అంత ఓకే అయితే వీరి కాంబినేషన్లో వచ్చే ఏడాదే సినిమా తెరకెక్కుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments