Kiara Advani:కియారా అద్వానీకి క్షమాపణలు చెప్పిన ఉపాసన కామినేని.. కారణమేంటీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీలకు టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన క్షమాపణలు చెప్పారు. ఉపాసన ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందనేగా మీ డౌట్.. అసలు విషయం తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఘనంగా సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీల వివాహం:
సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీల వివాహం మంగళవారం ఘనంగా జరిగింది. ఇరువురి కుటుంబం సభ్యులు, సన్నిహితులు, మిత్రులు వీరి పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వీరిద్దరి అభిమానులు, సినీ , రాజకీయ ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే కియారా అద్వానీ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఉపాసన స్పందించారు. ‘‘కాంగ్రాట్స్ కియారా.. మీ జంట చూడముచ్చటగా వుంది. వివాహానికి తాము హాజరుకాలేకపోయాము సారీ’’ అని కామెంట్ పెట్టారు.
వినయ విధేయ రామలో తొలిసారి చెర్రీ పక్కన కియారా:
కాగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్చరణ్ నటించిన ‘‘వినయ విధేయ రామ’’ చిత్రంలో చెర్రీ పెక్కన కియారా ఆడిపాడారు. అప్పటి నుంచి రామ్ చరణ్ దంపతులకు ఆమెకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న #RC15 కోసం మరోసారి రామ్చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దార్ధ్-కియారా మల్హోత్రాల వివాహా ఆహ్వాన పత్రిక చెర్రీ దంపతులకు అందింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్, ఇతర పనుల్లో బిజీగా వుండటంతో చరణ్ - ఉపాసనలు వీరి పెళ్లికి హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కియారాకు ఉపాసన క్షమాపణలు చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com