హాలీవుడ్ మూవీలో రాంచ‌ర‌ణ్ విల‌న్‌..

  • IndiaGlitz, [Saturday,August 06 2016]

రోజా, బొంబాయి వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరో అర‌వింద‌స్వామి మ‌ణిర‌త్నం క‌డ‌లితో రీ ఎంట్రీ ఇచ్చాడు. త‌నీ ఒరువ‌న్‌లో నెగ‌టివ్ రోల్ చేసిన‌ అర‌వింద్ స్వామి త‌న‌దైన న‌ట‌న‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించి ఇప్పుడు త‌నీ ఒరువ‌న్ తెలుగు రీమేక్ ధృవ‌లో కూడా రాంచ‌ర‌ణ్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

ఈ విల‌క్ష‌ణ న‌టుడు త్వ‌ర‌లోనే హాలీవుడ్ మూవీలో న‌టించ‌నున్నాడ‌ట‌. మ్యాడ్ మ్యాక్స్ చిత్రాన్ని నిర్మాత‌లు నిర్మించ‌బోయే చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర కోసం అర‌వింద్ స్వామిని సంప్ర‌దించార‌ట‌. అర‌వింద్ స్వామి స్క్రిప్ట్ విన్నాడ‌ని అంటున్నారు. ఈ విష‌యంపై స‌దరు న‌టుడు కూడా స్పందించాడు. తన‌ను హాలీవుడ్ మూవీకి సంబంధించిన‌వారు కాంటాక్ట్ చేసిందే నిజ‌మే కానీ ఈ విష‌యంపై ఇప్పుడే తానేం మాట్లాడ‌లేన‌ని,ఎందుకంటే ఇంకా ఏదీ ఫైన‌లైజ్ కాలేద‌ని చెప్పుకొచ్చాడ‌ట‌.