మహేశ్ ‘సర్కారు వారి పాట’లో చెర్రీ విలన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేశ్ తన 27వ సినిమాగా `సర్కారు వారి పాట` అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేసి సినిమాలను లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారు? అనే దానిపై పలు వార్తలు వినపడ్డాయి. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఈ చిత్రంలో విలన్‌గా చేస్తాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కన్నడ స్టార్ సుదీప్ ‘సర్కారు వారి పాట’లో విలన్‌గా నటిస్తాడంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ లిస్టులో ఓ కోలీవుడ్ స్టార్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినపడుతుంది.
మహేశ్ 27లో నటించబోతున్న కోలీవుడ్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో వినపడుతున్న పేరు ఎవరిదంటే.. అరవిందస్వామి. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న అరవింద స్వామి జయం రవి ‘తనీ ఒరువన్’ సినిమాతో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. అదే సినిమాను రామ్‌చరణ్ తెలుగులో ధృవ పేరుతో రీమేక్ చేస్తే అందులోనూ స్టైలిష్ విలన్‌గా నటించి మెప్పించాడు. ఆ తరవాత కోలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో విలన్‌గా, హీరోగా మెప్పించాడు. ఇప్పుడు మహేశ్ 27వ చిత్రం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో అరవిందస్వామి విలన్‌గా నటిస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com