Ram Charan-Upasana: మహారాష్ట్ర సీఎంను కలిసిన రామ్చరణ్ దంపతులు
Send us your feedback to audioarticles@vaarta.com
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భార్య ఉపాసనతో కలిసి ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. ఇటీవల కూతురు క్లిన్ కారాతో కలిసి ముంబైలో ఓ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే అంతకుముందు సిద్ధి గణపతి ఆలయానికి కూడా వెళ్లి పూజలు చేశారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే(Eknath Shinde) కుటుంబసభ్యులను చరణ్ దంపతలు కలిశారు. ఏక్నాథ్ షిండే ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లిన చెర్రీ, ఉపాసన విందులో పాల్గొన్నారు. అనంతరం వారి కుటుంబంతో కలిసి ఫొటోలు దిగారు.
ఈ ఫొటోలను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే గారు, శ్రీకాంత్ షిండే గారు మా మీద ఆప్యాయత చూపించి మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పోస్ట్ చేశారు. అలాగే ఉపాసన కూడా ‘మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ మారాయి.
ఇక మహా సీఎం ఏక్నాథ్ సైతం ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రామ్చరణ్, ఉపాసనతో సమావేశం బాగా జరిగిందని పేర్కొన్నారు. సినీ రంగంతో పాటు పలు అంశాలపై తమ మధ్య సానుకూల చర్చలు జరిగాయని తెలిపారు. కాగా ఈ భేటీలో షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే, ఆయన సతీమణి వృశాలి పాల్గొన్నారు.
కాగా ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీలో చెర్రీ నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర అని తెలుస్తోంది. చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా, అంజలి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు తమిళ నటుడు ఎస్జె సూర్య, సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout