Ram Charan Upasana:దుబాయ్‌లో ఉపాసనకు సీమంతం .. బీచ్‌లో భార్యతో గడిపిన చరణ్ , ఫోటోలు వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉపాసన తాను గర్భందాల్చినట్లు ప్రకటించి మెగా కుటుంబాన్ని, అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. ప్రెగ్నెన్సీ సమయంలోనే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఈ జంట మరింత జోష్‌లో వుంది. ఈ నేపథ్యంలో ఉపాసనకు ఆమె పుట్టింటివాళ్లు దుబాయ్‌లో సీమంత వేడుక నిర్వహించారు. ఉపాసన సిస్టర్స్ అనుష్పాల, సింధూరిలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ పండుగలా సాగింది. పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకున్న అనంతరం చరణ్, ఉపాసనలు దుబాయ్ బీచ్‌లో చక్కర్లు కొట్టారు. ప్రస్తుతం ఉపాసన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో మెగాభిమానులు ఈ జంటకు విషెస్ తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ ఇంట్లో అన్నీ శుభాలే :
ఇక ఈ ఏడాది మెగాస్టార్ ఇంట అన్ని శుభాలే జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్ తండ్రి కాబోతున్నాడని ప్రకటించడం.. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం, గ్లోబల్ స్టార్‌గా చరణ్‌కు గుర్తింపు రావడం, శంకర్‌తో సినిమా తీయాలన్న తన కలను చరణ్ తీరుస్తుండటం వంటి అంశాలతో చిరంజీవి ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. సరిగ్గా ఇదే సమయంలో రామ్ చరణ్ పుట్టినరోజు రావడంతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన కుమారుడికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు చిరు. ‘‘నాన్న రామ్‌చరణ్ నిన్ను చూసి గర్వంగా వుంది.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ విషెస్ చెప్పారు. ఈ మేరకు చరణ్‌కు అప్యాయంగా ముద్దు పెడుతున్న వీడియోను ఆయన షేర్ చేశారు.
గేమ్ చేంజర్‌గా రానున్న ఆర్‌సీ 15 :
ఇదిలావుండగా.. తమిళ దర్శక దిగ్గజం శంకర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను చరణ్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి ‘గేమ్ చేంజర్’ అనే పేరును ఖరారు చేశారు మేకర్స్. ఈ మేరకు టైటిల్ రివీల్ వీడియోను విడుదల చేశారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. టైటిల్ సూపర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com