Ram Charan, Upasana:మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టిన శ్రీమహాలక్ష్మీ .. తల్లిదండ్రులైన చరణ్ - ఉపాసన
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా అభిమానులకు శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా ఇద్దరు క్షేమంగా వున్నట్లు అపోలో ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత గర్భం దాల్చిన ఉపాసన:
కాగా.. 2012 జూన్ 14న ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో రామ్ చరణ్ - ఉపాసనల వివాహాం అంగరంగ వైభవంగా జరిగింది. భారతదేశంలోని అన్ని చిత్ర సీమలకు చెందిన అతిరథ మహారథులు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు చరణ్ - ఉపాసనల వివాహానికి హాజరయ్యారు. అప్పటి నుంచి మెగా వారసుడిని వీరిద్దరూ ఎప్పుడు ఇస్తారోనంటూ కుటుంబ సభ్యులు, అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు చరణ్ దంపతులు గతేడాది డిసెంబర్ 12న గుడ్‌న్యూస్ చెప్పారు. అప్పటి నుంచి సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఉపాసనకు బేబి షవర్ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఉపాసన బిడ్డ కోసం ట్యూన్ కట్టిన కాలభైరవ:
మరోవైపు.. ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం సంగీత దర్శకుడు, సింగర్ కాలభైరవ ఓ అందమైన ట్యూన్‌ను క్రియేట్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా వున్న ఆ ట్యూన్‌ను అందించినందుకు గాను కాలభైరవకు చరణ్ దంపతులు థ్యాంక్స్ చెప్పారు. ఈ ట్యూన్‌ను వారిద్దరూ చరణ్, ఉపాసనలు వీడియో రూపంలోనూ షేర్ చేసుకున్నారు. ధ్యానంలోకి వెళ్లడానికి, మనలో పాజిటివిటీని తీసుకురావడానికి ఈ ట్యూన్ ఎంతగానో సహకరిస్తుందని వీరిద్దరూ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments