చరణ్.. ఇద్దరు అన్నయ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'రంగస్థలం' మార్చి 30న విడుదల కానుండగా....ఇక ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న బోయపాటి శ్రీను సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన విషయమొకటి.. టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. ఇంతకీ అదేమిటంటే....ఈ రెండు చిత్రాల్లో చెర్రీకి అన్నపాత్రలు ఉండడం.. అవి కీలక పాత్రలు కావడం. అలాగే ఈ పాత్రలు కూడా కథానాయకులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన నటులు చేయడం. 2006లో 'ఒక V చిత్రం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత 'సరైనోడు' మూవీతో విలన్ గా, 'నిన్ను కోరి' చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనని తాను నిరూపించుకున్న ఆది పినిశెట్టి ..'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్‌కి అన్నయ్యగా కనిపించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అలాగే బోయపాటి మూవీలో చెర్రీకి అన్న పాత్రలో తమిళ నటుడు ప్రశాంత్ నటించనున్నారు. 1992లో 'లాఠీ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రశాంత్.. 'తొలిముద్దు', 'దొంగ దొంగ', 'చామంతి', 'జీన్స్', 'జోడి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ఇక ఈ రెండు పాత్రలు కూడా ఆయా సినిమాలకు కీలకపాత్రలు కావడం విశేషం.మరి.. ఒకే ఏడాదిలో బ్రదర్ సెంటిమెంట్‌తో రెండు సినిమాలతో వస్తున్న చెర్రీకి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout