కెమెరాతో ప్రకృతిలో ప్రయాణం ... వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా చెర్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.... మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చెర్రీ.. చిరుకు పుత్రోత్సాహాన్ని అందించాడు ఇప్పటికే. నటుడిగా ఇప్పటికే తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్న చెర్రీ.... భవిష్యత్ లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటాడు అనిపిస్తుంది. ఇప్పటి వరకు కెమెరా ముందు నిల్చుని హీరోగా మెప్పించిన మెగా వారసుడు... ప్రస్తుతం కెమెరా వెనక్కి వెళ్లి పోయాడు. వన్యప్రాణి సంరక్షణలో భాగంగా వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారిన చెర్రీ.... జంతు సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు తన వంతు పాత్ర పోషిస్తున్నాడు.
ఇందులో భాగంగానే కొత్తగా నిర్మించిన తన ఇంట్లో వైల్డెస్ట్ డ్రీమ్స్ పేరుతో ఓ విభాగాన్ని ప్రారంభించాడు చరణ్. వన్యప్రాణుల ఫోటోలు ఏర్పాటు చేసి... ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోతున్నాయని... ఇప్పటికైనా జంతుజాలాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని పిలుపునిస్తున్నాడు. ఈ ఫోటో ప్రదర్శన ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ స్వచ్చంధంగా సేవ చేస్తున్నాడు. చరణ్ తో పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు షాజ్ జంగ్, ఇజాజ్ ఖాన్, ఇషేతా సాల్ గావ్ కర్ ఇందుకోసం పనిచేస్తున్నారు.
డబ్ల్యు. డబ్ల్యు.ఎఫ్ అనే స్వచ్చంధ సంస్థ ప్రకృతిని కాపాడేందుకు 60 ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు మిలియన్ల సభ్యులతో కలిసి దాదాపు 100 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు రాయబారిగా పనిచేస్తున్న రామ్ చరణ్ భార్య సతీమణి ఉపాసన .... చెర్రీని వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారి సేవలందించాలని ప్రోత్సహించారట. మన భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందని పిలుపునిస్తున్నారు... కృత్రిమ వనరులతోనైనా జంతుజాలాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. నేను ప్రకృతిలో కెమెరాతో ప్రయాణించడానికి కారణం ఇదే అని.... ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిస్తున్నారు రామ్ చరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com