ప్రొఫెషనల్ బాక్సర్ వద్ద చరణ్ ట్రైనింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం తారక్‌తో కలిసి రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ చిత్రంలో హీరో్యిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావంతో సినిమా షూటింగ్ ఆగింది. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి పాత్రలో కనపడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలై ప్రోమోలో చెర్రీ లుక్ సరికొత్తగా ఉంది. అయితే ఈ లుక్ కోసం చరణ్ చాలా బాగానే కష్టపడుతున్నాడు. ప్రొఫెషనల్ బాక్సర్ నీరజ్ గోయత్ దగ్గర చరణ్ ప్రత్యేకమైన శిక్షణను తీసుకుంటున్నాడు.
ఈ విషయాన్ని సదరు ట్రైనర్ నీరజ్ గోయత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. చరణ్‌తో కలిసి వర్కవుట్ చేసిన తర్వాత తీసుకున్న ఓ ఫోటోను నీరజ్ ట్వీట్ చేశారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో తారక్ కనిపించబోతున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. వచ్చేఏడాది జనవరిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల వాయిదా పడింది. వచ్చే ఏడాది జూలైలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని సినీ వర్గాలంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments