రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయనున్న యువ దర్శకుడు?

  • IndiaGlitz, [Saturday,May 30 2020]

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ త‌దుప‌రి సినిమా ఎంట‌నే దానిపై అందరిలో గ‌త కొన్ని రోజులుగా మెదులుతున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్‌’ త‌ర్వాత చ‌ర‌ణ్ ప‌లానా ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌బోతున్నాడంటూ ర‌క‌ర‌కాల వార్త‌లైతే సోష‌ల్ మీడియాలో బాగా వినిపించాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ‘మ‌ళ్ళీరావా’, ‘జెర్సీ’ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన యువ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరితో చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే గౌత‌మ్ తిన్న‌నూరి ‘జెర్సీ’ చిత్రం హిందీ రీమేక్‌ను షాహిద్ కపూర్‌తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం లాక్‌డౌన్ కార‌ణం సినిమా షూటింగ్స్ ఆగాయి. షూటింగ్స్ జూన్‌లో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. ఒక‌వేళ అలా షూటింగ్స్ షురూ అయితే ఒక ప‌క్క చ‌ర‌ణ్ ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమాను.. మ‌రో ప‌క్క గౌత‌మ్ త‌న బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ ‘జెర్సీ’ని పూర్తి చేస్తారు. త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి సినిమాకు రెడీ అవుతార‌ని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ప్ర‌సాద్ నిర్మిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.