మెగా కలయిక.. చరణ్‌తో ప్రశాంత్ నీల్ మూవీ
Send us your feedback to audioarticles@vaarta.com
వరుస సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. ఈ కోవలో మెగా అభిమానులకు దసరా రోజున అదిరిపోయే కానుకలు వచ్చాయి. ఉదయం ఏమోషనల్ డ్రామాల స్పెషలిస్ట్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా... ఆ కొద్దిసేపటికే మరో క్రేజీ కాంభినేషన్‌కు సంబంధించిన న్యూస్‌ను పంచుకున్నారు చరణ్.
‘కేజీఎఫ్’ సినిమాతో భారతదేశం దృష్టిని ఆకర్షించి.. భారీ ఎలివేషన్ సీన్స్‌తో హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ మూవీకి సీక్వెల్‌గా కేజీఎఫ్ తీసిన ఆయన.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో యాక్షన్ డ్రామా ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్తోనూ ఓ సినిమా కమిటయ్యారు.
తాజాగా ప్రశాంత్నీల్.. మెగా పవర్ స్టార్ రామ్చరణ్, మెగాస్టార్ చిరంజీవిని దసరా పండుగ రోజు కలవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. చరణ్.. ప్రశాంత్ నీల్‌ని తన ఇంటికి ఆహ్వానించగా ఆ సమయంలో చిరంజీవితో కలిసి ప్రశాంత్ నీల్, చరణ్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చిరుని కలవడంతో చిన్ననాటి కల నెరవేరినట్టుగా తెలియజేశాడు. అయితే రామ్‌చరణ్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా పట్టాలెక్కించబోతున్నారని.. ప్రశాంత్ చెప్పిన కథ నచ్చడంతో చెర్రీ ఓకే చెప్పారని ఫలింనగర్ టాక్. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం వుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments