చరణ్... తండ్రి తర్వాత బాబాయ్‌తో..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో తన పార్ట్ పూర్తి కాగానే తండ్రి మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు చరణ్ త్వరలోనే తనకెంతో ఇష్టమైన బాబాయ్ పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించబోతున్నారట. వినపడుతున్న సమాచారం మేరకు క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో చరణ్ నటించబోతున్నారని టాక్. మరి ఈ వార్తలపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రెండు సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో మొదటిది ‘వకీల్‌సాబ్’..శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మరో చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. కొన్నిరోజుల ముందే ఈ సినిమా షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేశారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో సినిమా తాత్కాలికంగా షూటింగ్‌ను ఆపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments