మహేష్ హీరోయిన్ తో చరణ్ రొమాన్స్?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి శ్రీను కాంబినేషన్లో చరణ్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 19 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో కథానాయిక ఇంకా ఎంపిక కాలేదు. తొలుత రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించినా.. ఇటీవల అను ఇమ్మాన్యుయేల్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ అవకాశం కైరా అద్వానికి దక్కిందని తెలిసింది.
ప్రస్తుతం కైరా.. మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విడుదలయ్యే లోపే మరో తెలుగు చిత్రంలో నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మని వరించిందన్నమాట. అయితే.. కైరా ఎంపిక విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడంటూ ఆ మధ్య వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com