కొరియన్ పిల్లతో కాదా.. మళ్ళీ ఆమెతోనే రాంచరణ్ రొమాన్స్ ?

  • IndiaGlitz, [Tuesday,May 25 2021]

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తదుపరి చిత్రాలు లైనప్ ఆసక్తికరంగా ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కే చిత్రంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.

ఈ చిత్రం గురించి అనేక ఊహాగానాలు అభిమానుల్లో ప్రచారంలో ఉన్నాయి. శంకర్ ఇండియన్ 2 వ్యవహారం తేలితే ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో ఓ క్లారిటీ వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని టాక్. అందులో భాగంగా శంకర్.. రాంచరణ్ కు సరైన జోడీని సెట్ చేసే పనిలో ఉన్నాడు.

ఆ మధ్యన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కొరియన్ బ్యూటీ సుజి నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లోకల్ హీరోయిన్ నే తీసుకుందాం అని ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ పేరు పరిశీలిస్తున్నట్లు టాక్.

ఆర్ఆర్ఆర్ లో అలియా, చరణ్ జంటగా నటిస్తున్నారు. ఆమె వర్క్ కు ఫిదా అయిన చరణ్.. శంకర్ మూవీ కోసం ఆమెని రికమండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

More News

బ్రదర్స్ డే : సింగిల్ ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. చిరు కామెంట్

మెగాస్టార్ చిరంజీవి లేటుగా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. అయితేనేం.. కుర్రాళ్లకు తగ్గకుండా సోషల్ మీడియాలో కూడా దూసుకుపోతున్నారు. సామజిక మాధ్యమాల్లో చిరు చాలా యాక్టివ్ గా

వకీల్ సాబ్ : మతిపోగొడుతున్న నెల్లూరు కుర్రాళ్లు.. తమన్ ఫిదా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పింక్ రీమేక్ అయినప్పటికీ దర్శకుడు వేణు శ్రీరామ్

ఆ ఒక్క సాంగ్ తో సినిమా బ్లాక్ బస్టర్.. ఎన్టీఆర్ మూవీపై వైవిఎస్ చౌదరి

తెలుగు సినిమా కమర్షియల్ స్థాయిని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ముఖ్యంగా ఎన్టీఆర్, చిరంజీవి లతో ఆయన సాధించిన కమర్షియల్ సక్సెస్ లు

అఖిల్ మూవీపై రూమర్స్.. హమ్మయ్య అంటున్న అక్కినేని ఫ్యాన్స్

అఖిల్ సక్సెస్ ట్రాక్ ఎప్పుడెక్కుతాడా అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అభిమానుల దృష్టంతా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంపైనే ఉంది.

యాస్ తుపాను ఎఫెక్ట్... 25 రైళ్ల రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే మే 24 నుంచి మే 29వ తేదీ వరకు మొత్తం