విక్ట‌రీతో చ‌ర‌ణ్ చిత్రం..!!

  • IndiaGlitz, [Tuesday,February 18 2020]

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన వెంక‌టేశ్‌తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమా చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండి వ‌స్తుంది. న‌వ‌త‌రం హీరోల్లో అగ్ర క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీని స్టార్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబ‌ర్ 150'ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత చిరు 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'ని కూడా నిర్మించాడు చ‌ర‌ణ్‌. ఇప్పుడు చిరంజీవి152వ ,చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి నిర్మిస్తున్నాడు చ‌ర‌ణ్. ఇలా ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా చేసిన సినిమాల‌న్నీ చిరంజీవితోనే కావ‌డం గ‌మ‌నార్హం. చ‌ర‌ణ్ మ‌రో హీరోతో సినిమా చేయ‌డని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు రామ్‌చ‌ర‌ణ్ చేతిలో రెండు మ‌ల‌యాళ సినిమాల హ‌క్కులున్నాయి. వాటిలో 'లూసిఫ‌ర్' సినిమాను త్వ‌ర‌లోనే చిరంజీవితో చేయబోతున్నాడు. కాగా... మ‌రో మ‌ల‌యాళ చిత్రం 'డ్రైవింగ్ లైసెన్స్‌'ను వెంక‌టేశ్‌తో చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నాడ‌ట‌. మ‌రి ఈ సినిమా ఎప్ప‌డు మొద‌ల‌వుతుంది త‌దిత‌ర విష‌యాల‌న్నీబ‌య‌ట‌కు రావ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. ఎందుకంటే ప్ర‌స్తుతం వెంక‌టేశ్ అసుర‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు. మ‌రి దీని త‌ర్వాత విక్ట‌రీ..తరుణ్ భాస్క‌ర్ సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

More News

'ఆర్ఆర్ఆర్` నుండి చెర్రీ, ఆలియా లుక్స్ లీక్స్..?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ‘బాహుబ‌లి’

నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా 'పోస్టర్' సినిమా టిజర్ లాంచ్

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఎంతో ఫేమస్. అందులో ఎన్నో సినిమాలు వంద రోజులు ఆడాయి.

నన్ను నలభై ఏళ్లు వెనక్కి పంపింది - ‘శంకరాభరణం’ చూసి స్పందించిన విశ్వనాధ్‌

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మొట్ట మొదటి తెలుగు సినిమా ‘శంకరాభరణం’ విడుదలై 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా బాపురమణ అకాడమీ ఆధ్వర్యంలో ప్రసాద్‌ ల్యాబ్‌లో

రష్మికకి షాక్... ముద్దు పెట్టి అభిమాని పరుగో పరుగు 

హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌.. ఈ క‌న్న‌డ క‌స్తూరికి ఇప్పుడు టాలీవుడ్‌లో భారీ డిమాండే ఉంది.

సందీప్ వంగాకు షాక్‌.. సినిమా ఆగిందా?

తొలి చిత్రం `అర్జున్ రెడ్డి`తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోగా ఎదిగాడు.