సల్మాన్ కి చరణ్ డబ్బింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పడం ఏమిటి..? ఇదేదో తప్పు అనుకుంటే పొరపాటే. ఇది నిజంగా నిజం. అసలు విషయం ఏమిటంటే...సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్ జంటగా రూపొందుతున్న చిత్రం ప్రేమ్ రతన్ దన్ పాయో. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని తెలుగులో అనువదిస్తున్నారు.
అయితే సల్మాన్ పాత్రకు చరణ్ తో డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నారట. సల్మాన్ కు, చిరు ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకనే అనుకుంట సల్మాన్ అడిగిన వెంటనే చరణ్ ఓకె అన్నాడట. ఈరోజు నుంచే సల్మాన్ పాత్రకు చరణ్ డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలోనే ఈ మూవీకి తెలుగు టైటిల్ ఎనౌన్స్ చేయనున్నారు. సల్మాన్ తో రాజశ్రీ ప్రొడక్షన్ నిర్మించిన మైనే ప్యార్ కియా చిత్రాన్ని తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజ్ చేసారు. ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న ప్రేమ్ రతన్ దన్ పాయో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com