ఐదు భాషల్లో...తెలుగులో రామ్ చరణ్ చేస్తున్నాడా..?
- IndiaGlitz, [Tuesday,September 08 2015]
ఇటీవల తమిళంలో జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన చిత్రం తని ఒరువన్'(ఒకే ఒక్కడు అనే అర్థం వస్తుంది). ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు పోలీస్ స్టోరి, స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ఇప్పుడు బాలీవుడ్ సహా తెలుగు, మరాఠి, బెంగాళి, కన్నడలో ఈ సినిమాని రీమేక్ చేయడానికి చాలా మంది నిర్మాతలు, స్టార్ హీరోస్ ఆసక్తిని కనపరుస్తున్నారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించడానికి ఆసక్తిగా ఉన్నాడట. అలాగే తెలుగులో ఈ చిత్రాన్ని రామ్ చరణ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించే అవకాశాలున్నాయట. అలాగే బెంగాళీ, మరాఠి భాషల్లో కూడా సినినమా రూపొందడానికి చర్చలు జరుగుతున్నాయట.