రామ్ చ‌ర‌ణ్ ముఖ్య అతిథిగా డిసెంబ‌ర్ 18న అంత‌రిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక‌.. 

  • IndiaGlitz, [Saturday,December 15 2018]

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 kmph సినిమాను తెర‌కెక్కించారు సంక‌ల్ప్ రెడ్డి. తాజాగా విడుద‌లైన ఆడియో.. ఈ మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.

వ‌రుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు.జ్ఞాన‌శేఖ‌ర్ విఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

More News

డిసెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ట్రైల‌ర్.. ఆడియో లాంఛ్.. 

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి.

'ఎన్‌.జి.కె' రిలీజ్ డేట్‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ప్రేమికుల రోజున‌...

క‌న్ను గీటే చిన్న ప్రోమోతో నేష‌న‌ల్ వైడ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన న‌టి ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్. ఒరు ఆధార్ ల‌వ్ అనే మ‌ల‌యాళ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియ‌ర్ చేసిన న‌ట‌న

ద‌ర్శ‌కేంద్రుని చేతుల మీద‌గా 'ఇష్టం' ఫ‌స్ట్‌లుక్‌

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల క‌ళా ద‌ర్శ‌కుడు అశోక్.కె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న తెర‌కెక్కించిన మొద‌టి సినిమా `ఇష్టం` రిలీజ్‌కి రెడీ అవుతోంది.

ఎబిసిడి చిత్రంలో అల్లు శిరీష్ తండ్రి పాత్ర‌లో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు

కంటెంట్ వున్న‌ క‌థ‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్న అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏబీసీడీ.సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.