రామ్ చరణ్ ముఖ్య అతిథిగా డిసెంబర్ 18న అంతరిక్షం 9000 kmph ప్రీ రిలీజ్ వేడుక..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీనికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.
వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు.జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com