ఆ రీమేక్‌లో చ‌ర‌ణ్ న‌టిస్తాడా?

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ‌లో ఎన్టీఆర్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేస్తాడు. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమా గురించి రీసెంట్‌గా చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చేశాడు.

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవికి అభిలాష‌, రాక్ష‌షుడు, ఛాలెంజ్‌, మ‌ర‌ణ మృదంగం వంటి ఎన్నో విజ‌య‌వంతమైన చిత్రాల‌ను అందించిన నిర్మాత కె.ఎస్‌.రామారావు ఈ చ‌ర‌ణ్ సినిమాను నిర్మిస్తాడు. ద‌ర్శ‌కుడెవ‌ర‌నేది ఫైన‌లైజ్ కాలేదు కానీ.. గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను రీమేక్ చేస్తే బావుంటుంద‌ని అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినప‌డుతున్నాయి.

చిరంజీవికి మాస్‌లో ఇమేజ్‌ను హైప్ చేయ‌డంలో గ్యాంగ్ లీడ‌ర్ సినిమా అప్ప‌ట్లో ఎంత‌గానో దోహ‌దం చేసిన సంగ‌తి తెలిసిందే. అలాంటి సినిమాను రీమేక్ చేస్తే అంచ‌నాలు ఆటోమెటిక్‌గా ఉంటాయ‌డ‌నంలో సందేహం లేదు. మ‌రి చర‌ణ్ ఆ రీమేక్‌లో న‌టించ‌డానికి ఒప్పుకుంటాడా? అనేదే ప్ర‌శ్న‌.

More News

'భరత్ అనే నేను' 50 రోజుల వేడుకలు

డి పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం 'భరత్ అనే నేను'

విజేత టీజర్ కు అద్భుతమైన స్పందన

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై  ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది.

'హ్యాపి వెడ్డింగ్' కోసం తమన్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో అత్యంత భారీ వ్యయంతో 4 భాషల్లో ప్రతిష్టాత్మకంగా సాహో చిత్రాన్ని నిర్మిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వం

ప్ర‌భాస్‌తో నాగ్ అశ్విన్ చిత్రం?

'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం'తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన నాగ్ అశ్విన్‌.. తొలి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని అందుకున్నారు.

సందడంతా అక్కినేని ఫ్యామిలీదే..

మెగా ఫ్యామిలీ త‌రువాత ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీగా అక్కినేని ఫ్యామిలీని చెప్పుకోవ‌చ్చు.