బాలీవుడ్ లో మరోసారి చరణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
జంజీర్` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అక్కడ ఆశించిన స్థాయిలోవిజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మళ్ళీ చరణ్ బాలీవుడ్ సినిమా చేయలేదు. అయితే త్వరలోనే చరణ్ బాలీవుడ్ లో కనిపిస్తాడనే వార్తలు వినపడుతున్నాయి. వెన్స్ డే`, స్పెషల్ చబ్బీస్` చిత్రాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే రూపొందించనున్న ఎం.ఎస్.ధోని` చిత్రంలో చరణ్ నటించనున్నాడట. అయితే మెయిన్ లీడ్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు కదా అనే డౌట్ రావచ్చు. అయితే అసలు విషయంలోకి వెళ్తే..క్రికెటర్ ధోని ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ధోని స్నేహితుడైన రైనా పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com