మెగా హీరో మూవీలో అనసూయ...

  • IndiaGlitz, [Monday,February 29 2016]
బుల్లితెర నుంచి వెండితెర‌కు ప‌రిచ‌య‌మై..అన‌తి కాలంలోనే బాగా పాపుల‌ర్ అయిన యాంక‌ర్ ట‌ర్న‌డ్ యాక్ట్ర‌స్ అన‌సూయ‌. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో అన‌సూయ స్పెష‌ల్ సాంగ్ లో న‌టించింది. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. తాజాగా అన‌సూయ న‌టించిన చిత్రం క్ష‌ణం.
ఈ చిత్రం కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో అన‌సూయ కి మ‌రింత డిమాండ్ పెరిగింది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... మెగా హీరో మూవీలో అనసూయ న‌టించ‌నున్న‌ట్టు సమాచారం. ఇంత‌కీ మెగా హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో అన‌సూయ తో స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌నుకుంటున్నార‌ట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మూవీలో న‌టించేందుకు అన‌సూయ అంగీక‌రించిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్.

More News

నాని న్యూమూవీ టైటిల్..

నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.

విక్టరీ తో జతకడుతున్న కాజల్...

విక్టరీ వెంకటేష్...ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు...బంగారం సినిమాలో నటిస్తున్నారు.

శ్రీకాంత్ తో సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీపై అభిప్రాయం మారింది - టెర్రర్ నిర్మాత షేక్ మస్తాన్

హోప్,కలవరమాయే మదిలో...చిత్రాలు తెరకెక్కించిన సతీష్ కాసెట్టి తెరకెక్కించిన తాజా చిత్రం టెర్రర్.శ్రీకాంత్ హీరోగా నటించిన టెర్రర్ మూవీని షేక్ మస్తాన్ నిర్మించారు.

ఇద్దరు దొంగ వెధవల దారిద్రమైన కథే గుంటూర్ టాకీస్ - హీరో సిద్దూ

సిద్దూ,శ్రద్దా దాస్,రేష్మి,సీనియర్ నరేష్ ప్రధాన తారగణంగా రూపొందిన చిత్రం గుంటూర్ టాకీస్.

మహేష్ తో సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ సినిమా....

సూపర్ స్టార్ మహేష్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ తెలియజేశాడు. ప్రస్తుతం మహేష్ బ్రహ్మోత్సవం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.