చరణ్ - సుక్కు మూవీకి వెరైటీ టైటిల్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ధృవ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఓ మూవీ చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించనున్నారు.
అయితే...ఈ చిత్రానికి వెరైటీగా ఫేస్ బుక్ లైవ్ ఛాట్ @ 8.18 పి.ఎం అనే టైటిల్ ఖరారు చేసారు అంటూ ప్రచారం జరుగుతుంది. పల్లెటూరి నేపధ్యంతో ఈ సినిమాని రూపొందించనున్నట్టు సుకుమార్ గతంలో ప్రకటించారు. పల్లెటూరి కథకి ఫేస్ బుక్ లైవ్ ఛాట్ @ 8.18 పి.ఎం అనే టైటిల్ ఎలా సెట్ అవుతుంది అనేదే డౌట్. సుకుమార్ 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో...ఇలా డిఫరెంట్ టైటిల్స్ పెడుతుంటారు. అందుచేత నిజంగానే ఈ టైటిల్ కన్ ఫర్మ్ చేసారా..? లేక ఈ టైటిల్ రూమరేనా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com