చరణ్ - సుకుమార్ మూవీకి ముహుర్తం ఖరారు..!
Friday, October 7, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ చిత్రంలో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ధృవ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...రామ్ చరణ్ ధృవ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు.
చరణ్ - సుక్కు కాంబినేషన్ లో రూపొందే ఈ భారీ చిత్రాన్ని బ్లాక్ బష్టర్ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దసరా రోజున ప్రారంభించేందుకు ముహుర్తం ఖరారు చేసినట్టు సమాచారం. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. పల్లెటూరి నేపధ్యంలో సాగే వైవిధ్యమైన ఈ ప్రేమకథా చిత్రంలో చరణ్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడట. మరి...చరణ్ - సుక్కు కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments