చరణ్ - సుకుమార్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతాజా చిత్రం ధృవ. స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ధృవ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ తర్వాత చరణ్ - సుకుమార్ తో మూవీ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు ట్యూన్స్ ఫైనల్ చేసారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ప్రేమకథా చిత్రం కోసం హైదరాబాద్ శివారులో భారీ విలేజ్ సెట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments