స్టార్ హీరోగానే కాదు, నిర్మాతగా కూడా మెప్పిస్తున్న మెగాపవర్ స్టార్
- IndiaGlitz, [Monday,March 27 2017]
సినిమా పరిశ్రమ ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు..ముఖ్యంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోగా రాణించడమంటే అంత సులవు కాదు. ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు సినిమాపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఎష్టాబ్లిష్డ్ హీరో వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేయడమంటే, స్టార్డమ్తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిపోవడం కాదు. అది ఒక బాధ్యత. కోట్ల మంది అభిమానుల ఆశలను క్యారీ చేయడం అంత సులువు కాదు. అలాంటిబాధ్యతను అభిమానుల భారీ అంచనాలను అందుకుంటూ సూపర్‌హిట్ చిత్రాలను అందించాలి. ఆ విషయాన్ని ఆదిలో అందిపుచ్చుకుని అందరి అంచనాలను అందుకుంటూ దూసుకెళుతున్నారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.
ఆది నుండే గురుతర బాధ్యత టాలీవుడ్ మెగాస్టార్ తనయుడుగా చరణ్ ఎంట్రీ అనగానే ఎంతటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తండ్రి మెగాస్టార్ అంటే నటనకు, డ్యాన్సులకు పెట్టింది పేరు. కొడుకు చరణ్ కూడా తండ్రిని మించే ఉండాలని అభిమానులు కోరుకుంటారనడంలో సందేహం లేదు. ఇంత మంది ఆశలను నేరవేర్చేలా ప్రారంభంలో ఫైట్స్, డ్యాన్సుల్లో శిక్షణ తీసుకుని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత చిత్రంతో తెరంగేట్రం చేసిన చరణ్ భారీ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఇక రెండో చిత్రం 'మగధీర'... టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో తెలుగు సినిమా కలెక్షన్స్ రికార్డులను తిరగరాసి అఖండ విజయాన్ని అందుకున్నారు. మూడో చిత్రం 'ఆరెంజ్'లో రొమాంటిక్ హీరోగా అలరించి నాలుగో చిత్రం 'రచ్చ'తో మరో సూపర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. తొలిసారి ద్విపాత్రాభియం చేసిన సినిమా 'నాయక్'.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో సంక్రాంతి విజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన 'జంజీర్' (తుపాన్) చిత్రాన్ని రీమేక్ చేసి హిందీ రంగంలోకి అడుగుపెట్టారు. యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఎవడు'తో మరో సంక్రాంతి ఘన విజయాన్ని సాధించారు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. తక్కువ చిత్రాలతోనే ఎక్కువ విజ యాల్ని సాధించిన టాప్ హీరోల్లో ఒకరిగా అన్నివర్గాల ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'గోవిందుడు అందరి వాడేలే'లో చాలా డిఫరెంట్‌గా కనిపించారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలసి చూసి ఎంజాయ్ చేసేలా రూపొందిన ఈ చిత్రం సాధించిన సక్సెస్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌లో రామ్‌చరణ్ ఇమేజ్ మరింత పెరిగింది. తర్వాత సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య నిర్మించి కామెడి విత్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'బ్రూస్లీ దఫైటర్'తో మంచి విజయాన్ని అందుకున్నారు. కొత్త తరహా స్క్రిప్టులు, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ మెగా పవర్స్టార్రావమ్ చరణ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ధృవ చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించింది.
సక్సెస్ఫుల్ నిర్మాతగా రాణిస్తూ అగ్ర హీరోగానే కాదు, తాను అభిరుచి గల నిర్మాతనని 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో వ్రూవ్ చేసుకున్నారు చరణ్. దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలోఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్కాంప్రమైజ్డ్గా నిర్మించి బ్లాక్‌బస్టర్ నిర్మాతగా నిలిచారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించడానికి ప్లాన్స్ చేస్తున్నారు.
సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో... స్టార్ డైరెక్టర్స్ సుకుమార్ దర్శకత్వంలో శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్నాడు. హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ బడ్టెట్ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. లుక్, స్టయిలింగ్ పరంగా చాలా కేర్ తీసుకుని హీరోలను పొట్రేట్ చేసే సుకుమార్, రామ్‌చరణ్‌ను సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో... గీతాజంలి, రోజా వంటి ప్రేమ కథా చిత్రాలైన, ఘర్షణ వంటి ఎమోషనల్ చిత్రాలనైనా, చెలియా వంటి ఇన్టెన్స్ లవ్స్టోరీస్నైనా అద్భుతంగా తనదైన శైళిలో తెరకెక్కించే దర్శకుడు మణిరత్నం, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందనుంది.
జూన్‌లో ఈ సినిమా ప్రారంభం కానుంది. చేసే ప్రతి సినిమాను విభిన్నంగా చేస్తూ, కొత్త కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తూ ప్రతి చిత్రంతో ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు మార్చి 27. ఇలాంటి పుట్టినరోజులను ఎన్నింటినో సెలబ్రేట్ చేసుకుంటూ స్టార్ హీరోగా, నిర్మాతగా రాణించాలని కోరుకంటూ ...
********************హ్యాపీ బర్త్ డే టు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్**********************