'బ్యాంకాక్' లో రామ్ చరణ్ చిత్రం పతాక సన్నివేశాల చిత్రీకరణ..

  • IndiaGlitz, [Thursday,August 06 2015]

విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం గత నెల (జులై) 27 నుంచి బ్యాంకాక్ లో జరుగుతోంది.

ఈ చిత్రం గురించి బ్యాంకాక్ నుంచి నిర్మాత దానయ్య డి .వి.వి మాట్లాడుతూ ...' మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ నుంచి ఈ నెల 12న హైదరాబాద్ కు తిరిగి వస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య.

మరల హైదరాబాద్ లో ఈ నెల 13 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

దర్శకుడు 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది" అన్నారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ సమర్పణ : డి. పార్వతి నిర్మాత : దానయ్య డి.వి.వి. మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల

More News

మరోసారి లారెన్స్ దర్శకత్వంలో

కొరియోగ్రాఫర్ నుండి డైరెక్టర్ గా మారి ‘మాస్, స్టైల్, డాన్, రెబల్, ముని సీక్వెల్స్’ చిత్రాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వేందర్ మూవీస్ బ్యానర్ లో మరో రెండు సినిమాలు చేయనున్నాడు.

'శ్రీమంతుడు' మళ్లీ వారి చేతికే చిక్కాడు

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్, ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు’.

పవన్ కి అత్త మామలు..మరి చరణ్ కి...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ కళ్యాణ్ అత్తగా నదియా, మావయ్యగా రావు రమేష్ లు నటించిన సంగతి విదితమే.

పాటల రికార్డింగ్ లో 'చుట్టాలబ్బాయి'...

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ‘చుట్టాలబ్బాయి’ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

నాగ్ సరసన కొత్త భామ...

కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ హీరోలుగా సూపర్హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి. పతాకంపై మున్నా, బృందావనం, ఎవడు వంటి సూపర్హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి