కాశ్మీర్ లో రామ్ చరణ్...
Tuesday, April 19, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధృవ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
ఈ నెలాఖరు నుంచి కాశ్మీర్ లో షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ - రకుల్ ప్రీత్ సింగ్ పై కొన్ని సీన్స్, ఓ సాంగ్ చిత్రీకరించనున్నారు. తని ఓరువన్ లో నటించిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా సేమ్ క్యారెక్టర్ పోషిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నాజర్, పోసాని కృష్ణమురళీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మగథీర తర్వాత రామ్ చరణ్ - అల్లు అరవింద్ కాంబినేషన్లో రూపొందుతున్నధృవ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments