అభిమానులకు క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్
- IndiaGlitz, [Tuesday,October 01 2019]
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అభిమానులకు చరణ్ ఎందుకు క్షమాపణలు చెప్పారా? అనుకుంటే.. ఆదివారం బెంగళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకి భారీ సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. ఇంత మొత్తంలో అభిమానులు వస్తారని చిత్ర యూనిట్ భావించలేదట. చాలా మంది అభిమానులు థియేటర్ బయటనే ఉండిపోయారు. వేడుక పూర్తయిన తర్వాత రామ్‌చరణ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ పోస్ట్ చేశారు. ''అభిమానులకు క్షమాపణలు. మీకు హాలు సరిపోలేదు. చాలా మంది బయటే ఉండిపోయారు. సైరా థియేటర్స్‌కి అక్టోబర్ 2న వస్తుంది. ఈ ప్రేమాభిమానులు ఇలాగే చూపిస్తారని భావిస్తున్నాం'' అన్నారు రామ్‌చరణ్.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరు 151వ చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 2న తెలుగు,హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా భారీ రేంజ్లో విడుదలవుతుంది. చిరుతో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ .. తదితర భారీ తారాగణంతో రూపొందిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాశాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయట. ప్రపంచమంతటా 3800 స్క్రీన్స్‌లో విడుదలవుతున్న చిత్రమిది.