బాబాయ్ చాలా వీక్‌గా ఉన్నారు..: చెర్రీ
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైనప్పటికీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం మాత్రం ఆపకుండానే చేస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌కు మద్దతుగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ముందుకు కదిలారు. ఆదివారం నాడు విజయవాడలోని పవన్ నివాసానికి వెళ్లిన చెర్రీ.. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం బాబాయ్‌తో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్ వేదికగా బాబాయ్ గురించి చెర్రీ ఆసక్తికర పోస్ట్ చేశారు.
బాబాయ్ బలహీనంగా ఉన్నారు..!
"పవన్ చాలా బలహీనంగా ఉన్నారు. వేడి తీవ్రంగా ఉండటంతో... ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని డాక్టర్లు సూచించారు. ప్రచారం గడువు తేదీ త్వరలోనే ముగుస్తున్న కారణంగా ఈ రోజు (ఆదివారం) అనకాపల్లి, పెందుర్తిలలో ప్రచారం నిర్వహించాలని బాబాయి నిర్ణయించుకున్నారు. వైద్య నిపుణుల బృందాన్ని వెంట తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. పవన్ త్వరగా కోలుకోవాలని, ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని చెర్రీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ చూసిన మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కాగా.. శుక్రవారం విజయనగరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం పవన్ కళ్యాణ్ వడదెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అనారోగ్యంతోనే శనివారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు ఓటేయాలని జనసేనాని అభ్యర్థించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout