నిజ‌మైన మెగాస్టార్‌ను చూశానంటున్ను చెర్రీ

  • IndiaGlitz, [Monday,September 09 2019]

మెగాస్టార్ చిరంజీవితో ఎవ‌రికైనా సినిమా చేయాల‌నుంటుంది. అది ద‌ర్శ‌కుడైనా కావ‌చ్చు.. నిర్మాతైనా కావ‌చ్చు. అలాంటిది వ‌రుస‌గా రెండు సినిమాలు చేసే అవ‌కాశం వ‌స్తే.. ఆ నిర్మాత‌కు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప‌రిస్థితి అలాగే ఉంది. 'ఖైదీ నంబ‌ర్ 150' త‌ర్వాత చెర్రీ.. చిరుతో 'సైరా న‌ర‌సింహారెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిస్టారిక‌ల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న విడుదల‌వుతుంది. చిరంజీవి 151వ సినిమాల్లో న‌టించినా పాత్రలో ఒదిగిపోయి దానికి న్యాయం చేయ‌డానికి ఆయ‌న ప‌డే క‌ష్టం.. ఆయ‌న క‌మిట్‌మెంట్‌ను ఇంకా త‌గ్గ‌లేదు. దీన్ని చాలా ద‌గ్గ‌ర‌గా గ‌మ‌నించిన రామ్‌చ‌ర‌ణ్ ఇప్పుడు అదే విష‌యాన్ని చెప్పుకొచ్చాడు. త‌న ఇన్‌స్టాగ్రామ్ దార్వా ''సైరా న‌ర‌సింహారెడ్డిగా నాన్న‌గారు ఒదిగిపోవ‌డం చూశాను. అదొక అద్భుత‌మైన అనుభ‌వం. ఓ నిజ‌మైన మెగాస్టార్‌ను చూశాను'' అంటూ మెసేజ్ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ స‌మయంలో చిరంజీవి, చ‌ర‌ణ్‌లు తండ్రీ కొడుకుల్లాగా కాకుండా నిర్మాత‌, హీరోల్లాగా ప‌నిచేయ‌డం వ‌ల్ల‌నే ఓ మంచి ఔట్‌పుట్‌ను అందించార‌ట‌.

'సైరా న‌ర‌సింహారెడ్డి' విదేశీయుల‌కు వ్య‌తిరేకంగా పోరాడిన తొలి తెలుగు పోరాట‌ యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ‌. ఆ కాలాన్ని ప్ర‌తిబింబించేలా సెట్లు వేశారు. వీఎఫ్ ఎక్స్ చేశారు. ఎంతో ఖ‌ర్చుపెట్టి యుద్ధ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆ యుద్ధ స‌న్నివేశాల అందం తెలియాలంటే తెర‌పై కాసింత సేపు చూపించాలి.

ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, త‌మ‌న్నా నాయిక‌లుగా న‌టిస్తున్నారు. అనుష్క ఝాన్సీ ల‌క్ష్మీబాయి పాత్ర‌లో న‌టించింది. సుదీప్‌, విజ‌య్‌సేతుప‌తి ప్రామినెంట్ రోల్స్ చేస్తున్నారు. న‌ర‌సింహారెడ్డి గురువుగా అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ విడుద‌ల చేస్తోంది. త్వ‌ర‌లోనే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.