బన్నిలా నాకు అలాంటి ఆలోచన లేదు! - రామ్ చరణ్

  • IndiaGlitz, [Wednesday,December 07 2016]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం ధృవ‌. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్, ఎన్.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. త‌మిళ హిట్ మూవీ త‌ని ఓరువ‌న్ రీమేక్ గా రూపొందిన ధృవ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఇంట‌ర్ వ్యూ మీ కోసం...!
ధృవ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో అని టెన్ష‌న్ ఫీల‌వుతున్నారా..?
రీమేక్ మూవీ కాబ‌ట్టి కాస్త టెన్ష‌న్ ఎక్కువుగా ఉంది. ఎందుకంటే...త‌ని ఓరువ‌న్ కంటే బాగుండాలి అని చేసాం. అందుచేత కాస్త టెన్ష‌న్ ఎక్కువుగానే ఉంది.
స్ట్రైయిట్ మూవీ కాకుండా రీమేక్ చేయ‌డానికి కార‌ణం ఏమిటి..?
రీమేక్ చేసినా అది కూడా క‌థే క‌దా..! ఆ క‌థ‌ మ‌న తెలుగు వాళ్ల‌కు కొత్త‌గా ఉంటుంది క‌దా. అయినా...నా దృష్టిలో రీమేక్ చేయ‌డం త‌ప్పు కాదు.
త‌ని ఓరువ‌న్ చూసిన‌ప్పుడు రీమేక్ చేయాలి అని ఎందుకు అనిపించింది..?
క‌థ బాగా న‌చ్చింది. రెగ్యుల‌ర్ మూవీ కాకుండా డిఫ‌రెంట్ స్టోరీ. నేను ట్యాంక్ బండ్ పై ఉండే విగ్ర‌హాన్ని కాదు క‌దా...ఎప్పుడూ ఒకేలా ఉండ‌డానికి. నేను చేస్తే నాకు కొత్త‌గా ఉంటుంది అనిపించింది అందుకే చేసాను.
అర‌వింద్ స్వామితో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపించింది..?
ఆయ‌న సీనియ‌ర్ ఏక్ట‌ర్. ఆయ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం ఫ‌స్ట్ కాస్త ఇబ్బంది అనిపించింది. ఆత‌ర్వాత మా ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెర‌గ‌డం వ‌ల‌న విల‌న్ గా ట్రీట్ చేసి న‌టించ‌డం ఇబ్బంది అయ్యింది.
డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ధృవ ఓవ‌ర్ సీస్ లో 2 మిలియ‌న్ క‌లెక్ట్ చేస్తుంది అన్నారు. మీరేమంటారు..?
2 మిలియ‌న్ చేస్తే మంచిదే క‌దా..!
అందుకోస‌మే ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ ప్లాన్ చేసారా..?
ఆడియో ఫంక్ష‌న్ చేయాలి అనుకున్నాం కుద‌ర‌లేదు ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేసాం. ఆత‌ర్వాత ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ షో ప్లాన్ చేసారు. ఇదంతా అల్లు అర‌వింద్ గారి ప్లాన్.
త‌ని ఓరువ‌న్ కి - ధృవ‌కి ఎలాంటి మార్పులు చేసారు..?
మ‌న ప్రేక్ష‌కుల కోసం కొన్ని మార్పులు చేయ‌డం జ‌రిగింది అంతే కానీ..పెద్ద‌గా మార్పులు చేయ‌లేదు.
ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకున్న‌ది ఏమిటి..?
క‌థ‌లు ఎంచుకునే విధానం మారింది. కాక‌పోతే...అన్ని ప్లాన్ చేయ‌లేం క‌దా..!
మీతో బ్రూస్ లీ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించింది. సురేంద‌ర్ రెడ్డితో ర‌కుల్ ప్రీత్ కిక్ 2 చేసింది రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా ర‌కుల్ తీసుకోవ‌డానికి కార‌ణం..?
నేను వాటిని అంత‌గా ప‌ట్టించుకోను. ర‌కుల్ నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో చాలా బాగా న‌టించింది. టాప్ హీరోయిన్..బ్రిలియంట్ ఏక్ట‌ర‌స్. అందుకే ర‌కుల్ అయితే బాగుంటుంది అనిపించింది. అయినా ఎవ‌రున్నారు హీరోయిన్స్...చెప్పండి (న‌వ్వుతూ..)
సురేంద‌ర్ రెడ్డి ఇదే నా లాస్ట్ రీమేక్ ఫిల్మ్ మీతో కూడా చెప్పాను అన్నారు...? అలా ఎంద‌కు అన్నారు..?
నేను - సూరి సినిమా చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. ఆ టైమ్ లో రీమేక్ చేద్దాం అన్నప్పుడు సూరి ముందు ఉత్సాహంగా క‌నిపించ‌లేదు. ఆత‌ర్వాత ఓకే అన్నాడు. రీమేక్ చేయ‌డం అంటే చాలా క‌ష్టం. అందుక‌నే అలా అన్నాడు అనుకుంటున్నాను.
ఈ మూవీలో కామెడీ ఉంటుందా..?
సినిమా మొత్తం ఎంట‌ర్ టైన‌ర్. మ‌గ‌ధీర‌లో కామెడీ ఉండ‌దు. కానీ..సినిమా చూస్తున్నంత సేపు ఇంట్ర‌స్ట్ గా చూసేలా ఉంటుంది. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది.
ధృవ ర‌న్ టైమ్ 2.39 నిమిషాలు ఎక్కువ అవుతుందేమో అనిపించ‌లేదా..?
ఈ మూవీ 2.39 నిమిషాలు ఖ‌చ్చితంగా ఉండాలి. ఏ సీన్ ని త‌గ్గించ‌లేం తీసేలేం..!
ధృవ రిలీజ్ ఈనెల 2 నుంచి 9 వ తేదీకి మార్చ‌డానికి కార‌ణం..?
నోట్ల ర‌ద్దు వ‌ల‌న 2వ తారీఖు అయితే అంద‌రూ ఎటిఎం సెంట‌ర్ వ‌ద్ద నిలుచుని బిజీగా ఉంటారు ఎవ‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు ఉండ‌వు అని డేట్ మార్చాం.
ధృవ టైటిల్ లో 8 నెంబ‌ర్ ఉంది 8 నెంబ‌ర్ తో ఉన్న లింక్ ఏమిటి..?
రిలీజ్ వ‌ర‌కు ఆగండి...8తో ఉన్న లింక్ ఏమిటో మీకే తెలుస్తుంది. (న‌వ్వుతూ..)
నాన్న గారితో ఖైదీ నెం 150 చిత్ర నిర్మాత‌గా మీ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?
డైరెక్ట‌ర్ వినాయ‌క్ గారు కాబ‌ట్టి మ‌నం కూల్ గా ఉండ‌చ్చు. అంతా ఆయ‌న చూసుకుంటున్నారు. టాకీ మొత్తం పూర్త‌య్యింది. మిగిలిన పాట లాస్ట్ డే షూటింగ్ జ‌రుగుతుంది.
ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్ ఎప్పుడు..?
క్రిస్మ‌స్ కానుక‌గా ఖైదీ నెం 150 ఆడియో రిలీజ్ చేస్తున్నాం. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11, లేక 12న ఈ చిత్రాన్ని భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.
ఖైదీ నెం 150లో మీరు న‌టించారా..?
ఓ సాంగ్ లో క‌నిపిస్తాను (న‌వ్వుతూ..)
మ‌ణిర‌త్నం తో సినిమా చేయ‌నున్నార‌ని తెలిసింది..?
క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. క‌థ ఓకే అయితే త‌ప్ప‌కుండా ఉంటుంది.
మీరు ధృవ‌, నాన్న‌గారు ఖైదీ నెం 150 , బాబాయ్ కాట‌మ‌రాయుడు...వ‌రుస‌గా రీమేక్ లే చేస్తున్నారు..?
అనుకోకుండా జ‌రిగింది అంతే...కావాల‌ని రీమేక్ లు చేయ‌డం లేదు (న‌వ్వుతూ..)
బ‌న్ని వేరే స్టేట్స్ లో కూడా ఫాలోయింగ్ పెంచుకునేందుకు దృష్టి పెట్టాడు. మ‌రి...మీరు..?
నాకు ప్ర‌స్తుతం అలాంటి ఆలోచ‌న లేదు. నా దృష్టి అంతా ఇక్క‌డే..!
హ‌ర్ర‌ర్ ట్రెండ్ న‌డుస్తుంది క‌దా..! మీరు కూడా హ‌ర్ర‌ర్ మూవీ చేస్తారా..?
క‌థ న‌చ్చితే ఎలాంటి జోన‌ర్ సినిమా అయినా చేస్తాను.
క‌ళ్యాణ్ గారి బ్యాన‌ర్ లో మీ సినిమా ఉంటుంది అని గ‌తంలో ఎనౌన్స్ చేసారు క‌దా..! ఈ మూవీ ఎప్పుడు..?
వ‌చ్చే సంవ‌త్స‌రం ఉంటుంది.
కొర‌టాల శివ‌తో సినిమా చేయాలి అనుకున్నారు క‌దా..?
అవును..కుద‌ర‌లేదు. కానీ..భ‌విష్య‌త్ లో కొర‌టాల‌తో సినిమా ఉంటుంది.
సుకుమార్ తో చేయ‌నున్న‌ మూవీ ప్రారంభం ఎప్పుడు..?
ఖైదీ నెం 150 రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం.