close
Choose your channels

అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

Friday, March 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

 

అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు(శనివారం). ఈ సందర్భంగా ఆయన ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసేశాడు. రేపు పుట్టినరోజు కావడంతో ఈ రోజు ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో చెర్రీ బయటకు వచ్చి అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. అభిమానులను చూసిన సంతోషం చెర్రీ కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ ఆనందంలో చెర్రీ రేపటి సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేసేశాడు.

అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

రేపు తన పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ పోస్టర్ కూడా రాబోతోందని ఇదొక సర్‌ప్రైజ్ అని చెర్రీ వెల్లడించారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కూడా ఆయన పుట్టినరోజుకు సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. బర్త్ డేకు ఒకరోజు ముందుగానే 'ఆర్ఆర్ఆర్' టీం అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాలో చెర్రీ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపేందుకు గాను.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ రౌద్ర రూపాన్ని పరిచయం చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment