అభిమానుల సాక్షిగా సర్‌ప్రైజ్‌ను రివీల్ చేసిన రామ్ చరణ్

  • IndiaGlitz, [Friday,March 26 2021]

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు రేపు(శనివారం). ఈ సందర్భంగా ఆయన ఒక పెద్ద సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసేశాడు. రేపు పుట్టినరోజు కావడంతో ఈ రోజు ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో చెర్రీ బయటకు వచ్చి అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. అభిమానులను చూసిన సంతోషం చెర్రీ కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఆ ఆనందంలో చెర్రీ రేపటి సర్‌ప్రైజ్‌ను ముందే రివీల్ చేసి అభిమానులను ఫుల్ ఖుషీ చేసేశాడు.

రేపు తన పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య’ పోస్టర్ కూడా రాబోతోందని ఇదొక సర్‌ప్రైజ్ అని చెర్రీ వెల్లడించారు. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ కూడా ఆయన పుట్టినరోజుకు సర్‌ప్రైజ్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. బర్త్ డేకు ఒకరోజు ముందుగానే 'ఆర్ఆర్ఆర్' టీం అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమాలో చెర్రీ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతోందో తెలిపేందుకు గాను.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రామ్ చరణ్ రౌద్ర రూపాన్ని పరిచయం చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు.