'సైరా' సెట్లో అగ్నిప్రమాదం.. కారణం చెప్పని చెర్రీ!
Send us your feedback to audioarticles@vaarta.com
'సైరా' సెట్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధి కోకాపేటలోని మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్‌లో 'సైరా' షూటింగ్‌కు గాను వేసిన భారీ సెట్ వేశారు అగ్నికి ఆహుతైంది.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణనష్టమేమీ జరగలేదు. ఈ ప్రమాదంపై చిరు తనయుడు, 'సైరా' చిత్ర నిర్మాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చెర్రీ రియాక్ట్ అయి అగ్నిప్రమాదం విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.
చెర్రీ ఫేస్బుక్ పోస్ట్..
"శుక్రవారం ఉదయం కోకాపేటలో వేసిన సైరా సెట్ దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. చిత్రబృందం అంతా క్షేమంగా ఉంది.. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాము" అని ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని సినీప్రియులు, మెగాభిమానులకు తెలియజేశారు.
కాగా.. ఇవాళ సాయంత్రం జరగనున్న షూటింగ్లో అమితాబ్ బచ్చన్ పాల్గొనాల్సి ఉందని వార్తలు వినవస్తున్నాయి. కాగా ప్రమాదంపై చెర్రీ స్పందించారు గానీ.. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు.. ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout