'సైరా' సెట్‌లో అగ్నిప్రమాదం.. కారణం చెప్పని చెర్రీ!

  • IndiaGlitz, [Friday,May 03 2019]

'సైరా' సెట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పీఎస్ పరిధి కోకాపేటలోని మెగాస్టార్ చిరంజీవి ఫామ్ హౌస్‌లో 'సైరా' షూటింగ్‌‌కు గాను వేసిన భారీ సెట్ వేశారు అగ్నికి ఆహుతైంది.

ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లగా ఎలాంటి ప్రాణనష్టమేమీ జరగలేదు. ఈ ప్రమాదంపై చిరు తనయుడు, 'సైరా' చిత్ర నిర్మాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చెర్రీ రియాక్ట్ అయి అగ్నిప్రమాదం విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు.

చెర్రీ ఫేస్‌బుక్ పోస్ట్..

శుక్రవారం ఉదయం కోకాపేటలో వేసిన సైరా సెట్‌ దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుంది. ఏ ఒక్కరికి ప్రమాదం జరగలేదు. చిత్రబృందం అంతా క్షేమంగా ఉంది.. మా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాము అని ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని సినీప్రియులు, మెగాభిమానులకు తెలియజేశారు.

కాగా.. ఇవాళ సాయంత్రం జరగనున్న షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌‌ పాల్గొనాల్సి ఉందని వార్తలు వినవస్తున్నాయి. కాగా ప్రమాదంపై చెర్రీ స్పందించారు గానీ.. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం మాత్రం చెప్పలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా..? అనే విషయం ఇప్పటికీ తెలియరాలేదు.. ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.!

More News

సీఎం చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలోని కృష్ణా కరకట్ట సమీపంలో నివసిస్తున్న సంగతి తెలసిందే.

స్టార్ క్రికెటర్‌తో లవ్‌లో కాజల్ అగర్వాల్!

టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీబిజీగా ఉన్న ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ ప్రేమలో మునిగి తేలుతోంది.

'సిక్స్‌ ప్యాక్‌' కావాలంటే జిమ్‌కు కాదు.. ఈ ఆస్పత్రికెళ్లండి!

టైటిల్ చూడగానే ఇదేంటి.. సిక్స్ ఫ్యాక్ బాడీ కావాలంటే జిమ్‌కు వెళ్లి నానా వర్కవుట్స్ చేయాలి కదా.. మరి ఆస్పత్రికి వెళ్లడమేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు వింటున్నది నిజమే.

హాజీపూర్ సైకో శ్రీనివాస్‌లో కొత్త కోణం! 

యాదాద్రి జిల్లా హజీపూర్‌లో ముగ్గురు బాలికలను పొట్టనపెట్టుకున్న సైకో శ్రీనివాస్‌ను లోతుగా పోలీసులు విచారించే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.

ఉత్తరాంధ్రకు తప్పిన 'ఫొనీ' ముప్పు

ఉత్తరాంధ్రకు పెను తుఫాన్ 'ఫొనీ' ముప్పు తప్పింది. ఒడిశా రాష్ట్రంలో ‘ఫొనీ’ తుఫాన్ ప్రవేశించింది. దీని ప్రభావంతో పూరీలో కుండపోత వర్షం కురుస్తోంది. 'ఫొనీ' తుఫాన్ ప్రభావంతో 180-190 కిలోమీటర్ల