చరణ్ ఐదేళ్ళుగా అడుగుతున్నా సినిమా చేయని డైరెక్టర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రాంచరణ్... ఇప్పటి వరకు టాప్ డైరెక్టర్స్ ని నాతో సినిమా చేయమని అడగలేదట. కానీ ఐదేళ్ళుగా ఒకే ఒక డైరెక్టర్ ని నాతో సినిమా చేయమని అడిగాడట. ఇప్పటి వరకు ఆ డైరెక్టర్ చరణ్ తో సినిమా చేయలేదు. ఇంతకీ..ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు...గమ్యం, వేదం, క్రిష్ణం వందేజగద్గురుమ్, కంచె చిత్రాల దర్శకుడు క్రిష్. విభిన్నమైన కథ,కథనాలతో సినిమాలు తెరకెక్కిస్తూ..మంచి చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న క్రిష్ ను ఓ సినిమా చేయమని చరణ్ అడిగితే ఎందుకు చేయడం లేదనేది ఆసక్తిగా మారింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది అది ఏమిటంటే...ఓసారి చరణ్ కి క్రిష్ కథ చెప్పాడట. అది కూడా పూర్తిగా చెప్పలేదట. సగమే చెప్పాడట. సెకండాఫ్ త్వరలో చెబుతానన్న క్రిష్ మళ్లీ చరణ్‌కి కనపడడమే మానేసాడట. చరణ్ కి చెప్పిన కథకి చరణ్ సరిపోడు అనుకున్నాడో... ఏమో..సెకండాఫ్ ఇప్పటి వరకు చెప్పలేదట. ఈ విషయాన్ని అంతా స్వయంగా రాంచరణే కంచె ఆడియో వేడుకలో అందరి ముందు చెప్పేసాడు. మరి..ఇప్పుడైనా క్రిష్..చరణ్ తో సినిమా చేస్తాడో లేదో..?
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com